Adi Srinivas: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం వేడిని రగిలిస్తోంది. ఈ పరస్పర విమర్శల నేపధ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలతో పాటు తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా స్పందించారు.
ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్లో,”కేటీఆర్ అసలెవారన్నది ప్రజలు గమనించాలని సూచిస్తున్నాను. నిజాలు బయట పెట్టాలని అంటున్న సీఎం రమేశ్ ఇంటికెళ్లింది కేటీఆర్ కాదా? బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామన్నది నిజం కాదా? కవితపై ఉన్న కేసులను ఎత్తేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ ఖండించగలడా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అంతేకాదు,”బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుకోవడం లేదని బీజేపీ హైకమాండ్ తేల్చిచెప్పింది. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ఆ పార్టీని పట్టించుకోదని స్పష్టమైంది. సామాజిక వర్గాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరచిపోలేము. ఇప్పుడు దమ్ముంటే సీఎం రమేశ్ అడిగిన ప్రతి ప్రశ్నకు కేటీఆర్ నేరుగా సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో వాతావరణం మరింతగా హీట్ అయ్యింది. కేటీఆర్-సీఎం రమేశ్ ల విమర్శల పర్వం ఎటు దారితీస్తుందో అనేది రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికర చర్చగా మారింది.

