Adi srinivas: ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన అనియమాలపై విచారణకు సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు భయం పట్టుకుందని విమర్శించారు. నిజంగా దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాళ్లు విసరడం మానేసి, ఏసీబీ విచారణకు హాజరై వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవలి కాలంలో కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిని లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆది శ్రీనివాస్, “సవాళ్లు విసరడం బీఆర్‌ఎస్ నేతల స్వభావం, కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గిపోవడమే వారి శైలి. గతంలో డ్రగ్స్ కేసులో రేవంత్ సవాల్ విసిరినప్పుడు పారిపోయింది ఎవరు?” అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఏసీబీ విచారణకు సహకరించాలంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి సూచించారు.
అలాగే, కేటీఆర్ ఉపయోగిస్తున్న భాషపై ఆది శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆయన నోటి నుంచి వెలువడుతున్న అసభ్య పదజాలాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పారు,” అని వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కేటీఆర్‌కు శిక్ష తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఫార్ములా-ఈ కేసులో జరిగిన అక్రమాలపై నిజాలు బయటపడేందుకు కేటీఆర్ విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రభుత్వ విప్ స్పష్టం చేశార

