Huma Qureshi: నటి హుమా ఖురేషి కజిన్ బ్రదర్ ఆసిఫ్ ఖురేషి ఢిల్లీలో హత్యకు గురయ్యారు. పార్కింగ్ స్థలం విషయంలో జరిగిన ఘర్షణలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఆసిఫ్ ఖురేషి తన ఇంటి గేటు ముందు పార్క్ చేసిన స్కూటర్‌ను తీయమని ఇద్దరు వ్యక్తులను కోరారు. దీనితో వారి మధ్య వాగ్వాదం పెరిగి అది ఘర్షణకు దారితీసింది. ఆ గొడవలో దుండగులు ఆసిఫ్‌పై పదునైన వస్తువుతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు.
Also Read: Cricket: శుభ్‌మన్ గిల్‌కు కొత్త నాయకత్వ బాధ్యత: దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ కెప్టెన్‌గా ఎంపిక
వారి నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.గురువారం (ఆగస్టు 7, 2025) రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆసిఫ్ భార్య, బంధువులు ఆరోపించిన ప్రకారం, నిందితులు గతంలో కూడా ఇలాంటి పార్కింగ్ వివాదాల్లో ఆసిఫ్‌తో గొడవపడ్డారు. ఇది కేవలం చిన్న గొడవ కాదని, ముందుగా ప్లాన్ చేసిన దాడి అని వారు ఆరోపిస్తున్నారు. ఆసిఫ్ ఖురేషి (42) చికెన్ వ్యాపారం చేసేవారు. హుమా ఖురేషి తండ్రి సలీమ్ ఖురేషి ఈ విషయాన్ని నిర్ధారించారు. ప్రస్తుతానికి ఈ విషయంపై నటి హుమా ఖురేషి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పోలీసులు ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు.