Kiran Abbavaram: ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ సొంత గుర్తింపు, మార్కెట్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు కిరణ అబ్బవరం. డెబ్యూ మూవీ రాజావారు రాణిగారులో యాక్ట్ చేసిన రహస్య గోరఖ్, అదేనండీ.. రీల్ లైఫ్ హీరోయిన్ నే రియల్ లైఫ్ పార్ట్ నర్ చేసుకున్న సంగతి తెలిసిందే.. రీసెంట్ గా వైఫ్ తో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు కిరణ్. అక్కడ తమ బాబు నామకరణ కార్యక్రమం నిర్వహించారు.
Also Read: OG: ఓజి నుంచి మరో బిగ్ సర్ప్రైజ్!
బాబు నామకరణం తిరుమలలో చేసేందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం.. కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడాడు. `హనుమాన్ జయంతి రోజున పుట్టడంతో.. బాబుకి హను అబ్బవరం అని పేరు పెట్టాం.. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది.. `కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ నెలలోనే మరో కొత్త సినిమా కూడా ఓపెనింగ్ జరుగబోతోంది“ అని చెప్పుకొచ్చాడు. బాబు హను ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. బుడ్డోడు భలే క్యూట్ ఉన్నాడు అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Koduku Peru “Hanu Abbavaram ” ❤️
With the blessings of Lord Hanuman and Venkateshwara swamy we named our son Today at Tirumala 😇 pic.twitter.com/GzHDoL0poG
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 4, 2025

