Ajith Kumar: కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో అజిత్ కుమార్ మరోసారి రేసింగ్ ప్రమాదంలో తృటిలో బయటపడ్డారు. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్ ఈవెంట్లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ట్రాక్‌పై ఉన్న మరో కారును తప్పించేందుకు ప్రయత్నించిన సమయంలో, అతని వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అయితే అదృష్టవశాత్తూ, అజిత్ సురక్షితంగా కారు నుంచి బయటకు వచ్చారు. సంఘటన జరిగిన వెంటనే, రేసింగ్ టీమ్ వెంటనే స్పందించి ఆయన క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అభిమానులు కంగారు పడుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అజిత్ మాత్రం కొంత సమయం తర్వాత మళ్లీ రేస్‌లో పాల్గొని అభిమానులతో ఫొటోలు దిగారు.
Also Read: Road Accident: అయ్యో.. కాళ్ల పారాణి ఆరక ముందే భర్త.. అత్తామామలను కోల్పోయిన నవ వధువు
గత రెండు నెలల్లో అజిత్‌కు ఇది రెండో ప్రమాదం. జనవరిలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ ప్రాక్టీస్ సమయంలో, ఆయన కారు గోడను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో వాహనం ముందు భాగం దెబ్బతిన్నా, అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. రేసింగ్ పట్ల ఆయన ఉన్న ప్రేమ, పట్టుదల చూసి అభిమానులు అతని భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని కోరుతున్నారు.