Adilabad

Adilabad: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైవేపై వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొంది. దీంతో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన ఒక కుటుంబం భైంసా వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుడిహాత్నూరు మండలం మేకల గండి దగ్గర ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇక మృతులను మొజుద్దీన్ (60), మొయినుద్దీన్ (40), అలీ (8), ఉస్మానుద్దీన్ (10), ఉస్మాన్ (12)గా గుర్తించారు.

Also Read: ఔటర్ పై ఘోర ప్రమాదం . . డాక్టర్ మృతి !

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  BSNL: BSNL సూపర్ ప్లాన్.. తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *