Abhishek Sharma

Abhishek Sharma: గురువు రికార్డు బద్దలు కొట్టిన శిష్యుడు

Abhishek Sharma: పాకిస్థాన్‌పై టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో, అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. గతంలో ఈ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో యువరాజ్ సింగ్ పాకిస్థాన్‌పై 29 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం రికార్డు ఇప్పటికీ యువరాజ్ సింగ్ (2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లో) పేరిట ఉంది. కాబట్టి, అభిషేక్ రికార్డు కేవలం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం.

ఇది కూడా చదవండి: Abhishek Sharma: పాకిస్తాన్‌పై గ్రాండ్ విక్టరీ.. అభిషేక్ శర్మ అద్భుతమైన రికార్డు

ఈ రికార్డుతో, అభిషేక్ తన గురువు యువరాజ్ సింగ్‌ను అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత్-పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన 50 పరుగులు చేసిన రికార్డు మొహమ్మద్ హఫీజ్ పేరు మీదే ఉంది. డిసెంబర్ 28, 2012న అహ్మదాబాద్‌లో భారత్‌పై హఫీజ్ 50 పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 23 బంతులు మాత్రమే ఎదరుకున్నాడు. అభిషేక్ టీ20ల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 50 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. తాను ఎదుర్కొన్న 331వ బంతికి టీ20ల్లో తన 50వ సిక్సర్ బాదాడు, ఇన్నింగ్స్‌లోని మొదటి బంతికే రెండుసార్లు సిక్స్ కొట్టిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *