Aadhaar Card: ఆధార్ కార్డు మార్పు విషయంలో ఉచితంగా చేసుకునే గడువు ఈ రోజు (శనివారం)తో ముగియనున్నది. ఎలాంటి చార్జీలు చెల్లించకుండా ఆధార్ కార్డులో మార్పులు చేసుకునే అవకాశం ఉన్నది. ఈ నెల 15 నుంచి ఎలాంటి మార్పుకైనా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు యూఐడీఏఐ గడువు పొడిగించగా, మరోసారి పెంచుతుందని భావించారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.
Aadhaar Card: ఎవరైనా మార్పులు చేసుకోవాలంటే.. మై ఆధార్ పోర్టల్లో లాగిన్ కావాలి. సంబంధిత డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆధార్ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అయితే జనవరి వరకు మరోమారు పొడిగించే అవకాశం ఉంటుందని సమాచారం. కేంద్రం నుంచి ఈ రోజు సాయంత్రం కీలక ప్రకటన రావచ్చని తెలుస్తున్నది.