#AA22XA6

#AA22XA6: అమెరికా టు అబుదాబి!

#AA22XA6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కలిసి తెరకెక్కిస్తున్న #AA22xA6 సినిమా కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఈ భారీ పాన్-ఇండియా చిత్రం హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌, యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ సంచలనం సృష్టిస్తోంది.

ముంబైలో షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో అల్లు అర్జున్‌కు సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. మూడు నెలల పాటు భారీ సెట్‌లో జరిగిన ఈ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.

Also Read: Anantha Sriram: పాటల రచయిత పరిస్థితి రోజురోజుకు కఠినమవుతోంది

సినిమా టీమ్ ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్ పనుల కోసం అమెరికాకు వెళ్లనుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్‌ఎక్స్ ఉంటుందని, అందుకోసం అమెరికా నుంచి టాప్ వీఎఫ్‌ఎక్స్ ఎక్స్‌పర్ట్స్ టీమ్ ముంబైకి వచ్చినట్లు సమాచారం. ఈ టీమ్ షూటింగ్ పూర్తయ్యే వరకు ముంబైలోనే ఉంటుందని, అలాగే కొంత షూటింగ్ అమెరికాలో కూడా జరగనుందని తెలుస్తోంది. అవెంజర్స్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్ అందించిన టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు,

అబుదాబిలో తదుపరి షెడ్యూల్‌ను అక్టోబర్‌లో ప్రారంభించనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, ఒక్కో పాత్రకు భిన్నమైన లుక్‌లో ఉంటారని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులకు విజువల్ ట్రీట్‌గా నిలవనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *