AP News

AP News: జిల్లా కలెక్టరేట్లో కత్తి కలకలం..కత్తితో కలెక్టర్ వద్దకు వచ్చిన మహిళ.

AP News: ఎందక్కా..ఇది . ఇలా కత్తులు కటరాలు పెట్టుకుని తిరుగుతే ఎలా అక్క. అది కూడా కలెక్టర్ సర్ వద్దకు వచ్చినపుడు కూడానా. చూసుకోవాలి కదక్క …ఓ కడపక్క . ఇంతకి ఆ అక్క ఎందుకు కత్తి పెటైటుకుని కలెక్టరేట్ కు వచ్చింది ? అబ్బే…ఇది నా సెక్యూరిటీ కోసం అని చెప్పినా …నమ్మేలా లేదు కదా ..అని ఖాకీలు పట్టుకుని మొత్తం విచారించారు.

భూ సమస్యపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ కలెక్టరేట్‌లోకి కత్తి తేవడం కలకలం రేపింది. భద్రత సిబ్బంది తనిఖీలో ఇది బయటపడింది. అసలు ఎందుకు మహిళ కత్తి తీసుకొచ్చింది..? పోలీసులు ఏం చేశారు..?

శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి కలెక్టరేట్లో ఓ మహిళ కత్తితో రావడం కలకలం రేపింది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా మహిళ దగ్గర కత్తి ఉన్నట్లు బయటపడింది. భూ సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రేమలత అనే మహిళ వచ్చింది. కలెక్టరేట్ లోపలికి పంపిస్తుండగా కలెక్టరేట్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఆమె దగ్గర ఉన్న కత్తిని వారు స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మరక్షణ కోసమే కత్తి తీసుకొచ్చినట్లు ప్రేమలత పోలీసులకు సమాధానం చెప్పింది. తనకల్లు మండలం బొంతలపల్లి గ్రామానికి చెందిన మహిళగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఒంటరిగా ఉన్న తాను ఆత్మరక్షణ కోసం కత్తిని బ్యాగులో ఉంచుకొని తిరుగుతున్నట్లు మహిళ పోలీసులకు తెలియజేసింది. కత్తిని స్వాధీనం చేసుకుని పోలీసులు మహిళను కలెక్టరేట్లోకి అనుమతించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *