Nirmal: బేస్ బాల్ ఆడుతూ ఓ విద్యార్థి మృత్యు ఒడిలోకి చేరిన విషాదకర సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంజేపీ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఫయాజ్ హుస్సేన్ ఉదయం బేస్ బాల్ ఆడుతూ అస్వస్థతకు గురయ్యాడు.
మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాలలో విద్యార్ధి మృతి చెందాడు. పాఠశాల నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం. 9 వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఫైయాజ్ హుస్సేన్ ప్రతిరోజు లాగానే బేస్ బాల్ ఆడుతూ అస్వస్థత కు గురయ్యారు అన్నారు.
వెంటనే అప్రమత్తమయిన పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

