Leave Rejected: ఒక్కోసారి ఫస్ట్రేషన్ చాలా ఘోరమైన పనులను చేయిస్తుంది. తట్టుకోలేకపోతే విచక్షణ చంపేస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి అదే జరిగింది. ఎదో పనిపై సెలవు అడిగాడు. అతని సహోద్యోగులు దానిపై వాదించారు. సెలవు దొరకలేదు. దీంతో మనోడి ఫస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిపోయింది. అంతే.. కత్తి తీసి రఫా.. రఫా.. నలుగురినీ పొడిచేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Leave Rejected: సెలవు ఇవ్వడానికి నిరాకరించినందుకు పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రభుత్వ ఉద్యోగి నలుగురు సహోద్యోగులను కత్తితో పొడిచి చంపిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అమిత్ కుమార్ సర్కార్ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సోదేపూర్‌కు చెందినవాడు. అతను కోల్‌కతాలోని న్యూటన్ ప్రాంతంలోని సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
Leave Rejected: అతను ఇటీవల ఆఫీసులో సెలవు కోసం అప్లై చేసుకున్నాడు. అతని సెలవు అభ్యర్థనపై నలుగురు సహోద్యోగులు వాదించుకున్నారు. సెలవు దొరకలేదు. దీంతో ఆగ్రహించిన సర్కార్ తన బ్యాగులోంచి కత్తిని తీసుకుని నలుగురినీ వరుసగా పొడిచేశాడు. ఈ ప్రమాదంలో జైదేవ్ చక్రవర్తి, శంతను సాహా, సర్దా లేట్, షేక్ సదాఫుల్ అనే నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ నలుగురినీ రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
తరువాత, రక్తంతో తడిసిన కత్తిని పట్టుకుని, సర్కార్ నెమ్మదిగా వెళ్ళిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేసి సర్కార్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
తనకు సెలవు నిరాకరించడంతో ఆగ్రహించిన సర్కార్, తన సహచరులను కత్తితో పొడిచాడని పోలీసులు చెప్పారు. వీరిలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. అసలు సర్కార్ కు సెలవు ఎందుకు నిరాకరించారో తెలియరాలేదని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

