ap crime news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం అలుముకున్నది. ఓ పందెం కోడి కారణంగా నలుగురున్న కుటుంబమంతా బలయింది. హృదయ విదారకమైన ఈ ఘటన అందరినీ కలచివేస్తున్నది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటలో పందెం కోడికి ఈత నేర్పడానికి సమీపంలోని కాలువకు తండ్రి, ఇద్దరు కూమారులు వెళ్లారు. ఆ కోడికి ఈత నేర్పుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తండ్రి వెంకటేశ్వరరావు (45), కుమారులైన మణికంఠ (15), సాయి కుమార్ (13) చనిపోయారు.
ap crime news: వీరిలో గల్లంతైన ఓ బాలుడి మృతదేహం దొరకలేదు. ఈ విషాదం తెలిసిన వెంకటేశ్వరరావు భార్య దేవి (36) కుప్పకూలిపోయింది. భరించలేక తీవ్ర మానసిక వేదనకు గురైంది. భర్త, ఇద్దరు కుమారులు కానరాని లోకాలకు వెళ్లారన్న వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. తల్లడిల్లిన ఆ మాతృమూర్తి ఇక ఈ లోకంలో ఉండలేనని అనుకున్నది. బాత్‌రూంలోని ఇనుప రాడ్డుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
ap crime news: దీంతో ఓ పందెం కోడి కోసం కుటుంబమంతా బలైనట్లయింది. నలుగురు మరణంతో కవ్వకుంటలో విషాదం అలుముకున్నది. బంధుమిత్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.