Hyderabad: తెలంగాణ ప్రభుత్వంతో వంతారా బృందం ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే కొత్త జూ పార్క్ అభివృద్ధి, నిర్వహణ కోసం ఈ MoU కుదిరింది.
ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. జంతు సంరక్షణ, పునరావాసంపై వంతారా బృందం తీసుకుంటున్న బాధ్యతాభారిత చర్యలు ప్రశంసనీయమని చెప్పారు.
“జంతువుల సేవ” అనే నినాదంతో వంతారా పనిచేయడం అభినందనీయం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ సహకారంతో రాష్ట్రంలో వైల్డ్‌లైఫ్ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

