Ajith pawar: మా పార్టీకి ఓటు వేయకపోతే నిధులు ఇవ్వం

Ajith pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. బారామతిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

 

“మా అభ్యర్థులు గెలవకపోతే నిధులు ఉండవు”

 

ప్రచార సభలో మాట్లాడుతూ, “మీ వద్ద ఓట్లు ఉన్నాయి… నా వద్ద నిధులు ఉన్నాయి. మీరు మా పార్టీ అభ్యర్థులను తిరస్కరిస్తే, నేను కూడా నిధుల విషయంలో అదే చేస్తాను” అని అజిత్ పవార్ హెచ్చరించారు.

ఎన్సీపీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ 18 మంది ఎన్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే ఆ ప్రాంతానికి అవసరమైన నిధులను నిరభ్యంతరంగా ఇస్తానని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నిధుల కేటాయింపు తన చేతుల్లోనే ఉందని సూచించారు.

 

విపక్షాల విమర్శలు

అజిత్ పవార్ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ఓటర్లను బెదిరిస్తున్న వ్యాఖ్యలు ఇవి ప్రజల పన్నుల ద్వారా వచ్చే నిధులను తన సొంత నిధుల్లా చూపించడం తప్పు అభివృద్ధిని ఓటింగ్‌తో కట్టిపడేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం శివసేన (యూబీటీ) నేత ఆంబాదాస్ మాట్లాడుతూ, “ప్రజలే ప్రభుత్వానికి నిధులు అందజేస్తారు. ఇవి అజిత్ పవార్ వ్యక్తిగత నిధులు కావు” అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *