Kantara Chapter 1: రిషబ్ శెట్టి సారథ్యంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. బ్లాక్‌బస్టర్ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం మరో అరుదైన మైలురాయి అందుకుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే థియేటర్లలో ఇంకా ఆడుతోంది.
Also Read: Naga Chaithanya: మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలు పెంచేసిన చైతు
కన్నడ చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన ‘కాంతార’ ప్రీక్వెల్ ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. 850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రిషబ్ శెట్టి దర్శక-నటుడిగా మరోసారి తన మార్క్ చూపించాడు. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా 50 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకు మరింత ఎలివేషన్ ఇచ్చింది. ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లలో ఇంకా హౌస్‌ఫుల్ బోర్డులు వేస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది.

