Naga Chaithanya: యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ‘తండేల్’ వంటి భారీ హిట్ అందుకున్న చైతూ, తన తదుపరి ప్రాజెక్టును హారర్, మైథలాజికల్ అంశాలు కలగలిపిన కథతో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘విరూపాక్ష’ వంటి సంచలన విజయాన్ని అందించిన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
కార్తీక్ దండు, సాయి ధరమ్ తేజ్‌తో చేసిన ‘విరూపాక్ష’ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు చైతూతో కూడా అదే తరహాలో అద్భుతమైన విజువల్స్, స్క్రిప్ట్ బేస్డ్ సినిమాను రూపొందించేందుకు కార్తీక్ భారీ ప్రయత్నం చేస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ ఏర్పాట్లు!
నాగ చైతన్య సినిమా కోసం దర్శకుడు కార్తీక్ దండు అత్యంత భారీ స్థాయిలో సెట్టింగ్‌లను సిద్ధం చేయిస్తున్నారు.ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో అతిపెద్ద పురాతన భవనం సెట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. మేకింగ్ వీడియోలో కనిపించిన దృశ్యాలను బట్టి చూస్తే, ఈ సెట్టింగ్‌లలో ఏదో ఒక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.నాగ చైతన్య కెరీర్లో ఇంత భారీ స్థాయిలో సెట్టింగ్‌లను వేసి, షూటింగ్ జరుపుకుంటున్న సినిమా బహుశా ఇదే మొదటిసారి కావచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: ENG vs AUS: నేటి నుంచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మహాపోరు!
యాక్షన్, స్టైల్‌తో అదరగొడుతున్న చైతూ
తాజాగా విడుదలైన ఈ సినిమా మేకింగ్ వీడియో చూసిన అభిమానులు, ప్రేక్షకులు సినిమా స్టైల్‌ను, విజువల్స్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.
ఈ ప్రాజెక్టును కేవలం కమర్షియల్ అంశాల కోసమే కాకుండా, పకడ్బందీగా అల్లిన కంప్లీట్ స్క్రిప్ట్ బేస్డ్ చిత్రంగానే తీసుకొస్తున్నట్లు మేకింగ్ వీడియో స్పష్టం చేస్తోంది. వీడియోలో చైతూకు సంబంధించిన యాక్షన్ సీన్లు కూడా అదిరిపోయే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను విజువల్‌గా, కథా పరంగా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మైథలాజికల్ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

