Jubilee Hills By-Election Counting: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ నెలకొన్న వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఉపఎన్నికల బరిలో నిలిచిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
మరికొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమై, తుది ఫలితం వెలువడబోతున్న కీలక సమయంలో అన్వర్ మృతి చెందడం కౌంటింగ్ కేంద్రం వద్ద, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Jubilee Hills By-Election Counting: బీఆర్ఎస్ ఏజెంట్లుగా మాజీ ఎమ్మెల్యేలు..
మహమ్మద్ అన్వర్ కాసేపటి క్రితమే హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఎన్నికల ఫలితాల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తరుణంలో, ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఫలితం కోసం ఎదురుచూస్తున్న సమయంలో అభ్యర్థి మరణం అందరినీ కలచివేసింది.

