Govinda: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో మంగళవారం రాత్రి సమయంలో ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు మరియు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Samantha: సమంత కొత్త ఆధ్యాయం మొదలైంది.. ఇంకో బ్రాండ్ లాంచ్ చేసిన సామ్..
చికిత్స వివరాలు
గోవిందాను ఆయన నివాసానికి సమీపంలోనే ఉన్న క్రిటికేర్ ఆసుపత్రిలో చేర్చామని లలిత్ బిందాల్ తెలిపారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు చాలావరకు రక్త పరీక్షలు (Blood Tests) చేయించారని, వాటి రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని లలిత్ బిందాల్ పేర్కొన్నారు.ప్రస్తుతం గోవిందా పరిస్థితి నిలకడగానే ఉందని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గోవిందా త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.

