Fire Accident: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ట్రావెల్స్ బస్సు దహనమై 19 మంది సజీవదహనమైన ఘటనను మరువక ముందే నల్లగొండ జిల్లాలో మరో ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. ముందే అప్రమత్తమైన ప్రయాణికులు కిందికి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ప్రాణనష్టం జరగకుండా పెనుప్రమాదం తప్పింది.
Fire Accident: నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌కు చెందిన విహారి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై మంటలు వచ్చాయి. గమనించిన ప్రయాణికులు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి కిందికి దూకేశారు. మంటలు పెద్దగై బస్సు దహనమైంది.
Fire Accident: ప్రమాదం జరిగినప్పుడు బస్సులో డ్రైవర్ సహా 43 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సుకు ఫిట్నెస్ లేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రయాణికులు ముందు జాగ్రత్తగా కిందికి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. లేకుంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని ప్రయాణికులతోపాటు స్థానికులు తెలిపారు. వరుస ప్రమాదాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల్లో భయాందోళన నెలకొన్నది.

