Rajnath Singh: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడులో కనీసం తొమ్మిది మంది మరణించడం, 20 మందికి పైగా గాయపడటంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘోర దాడి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు, కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. ఈ పేలుడు ఘటనను రాజ్నాథ్ సింగ్ శాంతిని అస్థిరపరచడానికి ఉద్దేశించిన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ దాడికి బాధ్యులైన వారిని వదిలిపెట్టం.
ఇది కూడా చదవండి: Dowry Harassment: సరిపోని కట్నం.. వరకట్నం కోసం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ దాదితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ న్యాయాన్ని ఎదుర్కొనేలా మేము చూస్తామని రక్షణ మంత్రి పేర్కొన్నారు. భద్రతా సంస్థలు పూర్తి బలంతో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మరియు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వంటి అనేక ఏజెన్సీలు దర్యాప్తును నిర్వహిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం దానిని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆయన తెలిపారు. త్వరలో NIA అధికారికంగా కేసును టేకోవర్ చేసే అవకాశం ఉంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. పేలుడు తర్వాత పరిస్థితిని నియంత్రించడంలో వేగంగా స్పందించిన ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సేవలను ఆయన ప్రశంసించారు.

