Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన అత్యంత తీవ్రమైన పేలుడు ఘటనలో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మరియు కేంద్ర నిఘా సంస్థలు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. భద్రతా చర్యలలో భాగంగా, లాల్ ఖిలా మెట్రో స్టేషన్ మూసివేయబడుతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. : ఈ కేసు దర్యాప్తులో జమ్ము కశ్మీర్‌కు చెందిన తారిక్ మరియు ఉమర్ మొహమ్మద్ అనే ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఢిల్లీ పోలీసు అధికారులు వెల్లడించారు. పేలుడుకు ఉపయోగించిన కారును తారిక్కు విక్రయించినట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Dowry Harassment: సరిపోని కట్నం.. వరకట్నం కోసం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
పేలుడు జరిగిన హ్యుందాయ్ ఐ20 కారు (నంబర్ HR 26 7624) పాత యజమాని సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, అతను కారును ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన దేవేంద్రకు, ఆ తర్వాత హర్యానాలోని అంబాలాకు చెందిన మరొక వ్యక్తికి విక్రయించినట్లు వెల్లడించారు. సల్మాన్ అందించిన దస్త్రాల ఆధారంగా RTO అధికారుల సహాయంతో అసలు యజమానిని గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. ఈ పేలుడు కదులుతున్న ఐ20 కారు లోపల జరిగింది, ఆ సమయంలో అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

