Rajat Patidar

Rajat Patidar: టీమిండియాకు బిగ్ షాక్!

Rajat Patidar: టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ రజత్ పటీదార్‌కి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. సౌత్ ఆఫ్రికా ‘ఎ’ పర్యటనలో గాయపడిన పటీదార్, కోలుకోవడానికి సుమారు నాలుగు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా, రానున్న కీలకమైన దేశవాళీ సీజన్‌తో సహా పలు మ్యాచ్‌లకు ఆయన దూరం కానున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా రజత్ పటీదార్ గాయపడ్డాడు. గాయం తీవ్రతపై వచ్చిన తాజా నివేదికల ప్రకారం, ఈ మిడిలార్డర్ బ్యాటర్ సుదీర్ఘకాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది.

ఈ గాయం కారణంగా రజత్ పటీదార్ రంజీ ట్రోఫీ సీజన్ ద్వితీయార్థంతో పాటు ఇతర దేశవాళీ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ 32 ఏళ్ల బ్యాటర్ గత కొన్ని సీజన్‌లుగా దేశవాళీ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తూ టీమిండియా టెస్ట్ జట్టుకు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికయ్యే రేసులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో, అతని గాయం కేవలం వ్యక్తిగతంగానే కాక, మధ్యప్రదేశ్ జట్టుకు కూడా పెద్ద నష్టంగా పరిగణించవచ్చు.

ఇది కూడా చదవండి: Begumpet Drugs Case: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. ఆరుగురు మంది హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థుల అరెస్టు

ఫిబ్రవరి 2026 నాటికి రజత్ పూర్తిగా కోలుకుని, రాబోయే ఐపీఎల్ సీజన్ 2026 నాటికి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం.గాయానికి ముందు రజత్ పటీదార్ దేశవాళీ రెడ్-బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతూ ఇటీవలే డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *