Bhagyashree Borse: భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్, కింగ్‌డమ్ సినిమాలతో గుర్తింపు పొందింది. అయితే ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు నవంబర్‌లో తన రెండు కొత్త చిత్రాలు రిలీజవుతున్నాయి. కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ కాబోతున్నాయి. వీటిపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Raveena Tandon: స్విమ్‌సూట్ సీన్: షారుక్‌ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసిన రవీనా టాండన్!
భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్‌తో అరంగేట్రం చేసింది. గ్లామరస్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. రెండో సినిమా విజయ్ దేవరకొండతో కింగ్‌డమ్ చేసింది. రెండూ సక్సెస్ కాలేదు కానీ ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. అందం, అభినయంతో గుర్తింపు పొందింది. ఇక ఈ నవంబర్‌లో పెద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. రెండు సినిమాలు రెండు వారాల గ్యాప్‌లో రిలీజ్ కాబోతున్నాయి. కాంతలో దుల్కర్ సల్మాన్ సరసన నటిస్తోంది. ఈ పీరియాడికల్ డ్రామాపై బజ్ భారీగా ఉంది. ఈ సినిమాతో భాగ్యశ్రీ తన క్యారెక్టర్‌తో ఆకట్టుకోవాలని చూస్తోంది. ఇది హిట్ అయితే ఆమెకు తొలి సక్సెస్ లభిస్తుంది. ఆ తర్వాత ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో రామ్ పోతినేని హీరో. హీరో అభిమాని జీవితం ఆధారంగా ఈ సినిమా రానుంది. రామ్ ఎనర్జిటిక్ రోల్లో మాస్, క్లాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవనున్నాడు. ఈ సినిమా గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రెండింటిలో ఒకటి హిట్ అయినా భాగ్యశ్రీ కెరీర్ ఇంకా బూస్ట్ అవుతుంది. ఒకవేళ రెండూ హిట్ అయితే ఇక ఆమెకు టాలీవుడ్ లో తిరుగు ఉండదు.మరి ఈ సినిమాలు ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.

