Bandla ganesh: నిర్మాత బండ్ల గణేశ్ తాజాగా తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు. ‘కె రాంప్’ సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారడంతో ఆయన స్పందించారు. ఎవరి మనసునైనా తన మాటలు నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు
బండ్ల గణేశ్ మాట్లాడుతూ:
“సక్సెస్ మీట్‌లో నేను చెప్పిన మాటలు కొందరిని బాధపెట్టినట్లు తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. సినీ పరిశ్రమలో అందరూ ఎదగాలి, కళామాత అనుగ్రహంతో అందరం ముందుకు వెళ్లాలి అనేదే నా కోరిక. ఎవరికైనా మనస్తాపం కలిగితే హృదయపూర్వక క్షమాపణలు” అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా, వెబ్ మీడియాలో విస్తృత చర్చలు సాగాయి. ముఖ్యంగా “ఒకప్పుడు నా దగ్గర అవకాశాలు అడిగినవాళ్లు, ఇప్పుడు స్టార్ హీరోలయ్యారు” అన్న ఆయన వ్యాఖ్యలు విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేశారన్న ప్రచారం జరిగింది. దీనిపై స్పందిస్తూ, ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశ్యం లేదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.

