65th National High Way:

65th National High Way: విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ హైవే విస్త‌ర‌ణ‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

65th National High Way: ఎప్పుడెప్పుడా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ 65వ జాతీయ ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు తాజాగా కేంద్ర ర‌హ‌దారి, ర‌వాణా శాఖ నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. దీంతో నాలుగు లేన్ల ర‌హ‌దారిగా ఉన్న ఈ జాతీయ ర‌హ‌దారిని ఆరు లేన్ల ర‌హ‌దారిగా విస్త‌రించ‌నున్నారు.

65th National High Way: విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ 65వ జాతీయ ర‌హ‌దారిలో 40వ కిలోమీట‌ర్ నుంచి 269వ కిలోమీట‌రు వ‌ర‌కు మొత్తం 229 కిలోమీట‌ర్ల పొడ‌వున నాలుగు వ‌రుసలుగా ఉన్న రోడ్డును ఆరు వ‌రుస‌ల ర‌హ‌దారిగా విస్త‌రించ‌నున్నారు. ఈ మేర‌కు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ కోసం తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని అధికారుల‌ను నియ‌మిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. గ‌డువులోగా పూర్త‌య్యేందుకు చొర‌వ తీసుకోవాల‌ని ఆదేశించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *