Chiranjeevi: ప్రముఖ తెలుగు నటుడు మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరు, ఫోటో, వాయిస్‌ను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.
చిరంజీవి ఫిర్యాదు ప్రకారం, దయా చౌదరి అనే వ్యక్తి ‘ఎక్స్’ వేదికపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి, తన పేరు, రూపం, వాయిస్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించరాదని ఉత్తర్వులు పొందినట్టు పేర్కొన్నారు.
అయితే కోర్టు ఉత్తర్వుల తర్వాత కూడా ఉల్లంఘనలు ఆగకపోవడంతో, చిరంజీవి మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవలే ఆయన తన ఫిర్యాదులో, ఏఐ సాంకేతికతను ఉపయోగించి తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టిస్తున్నారనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

