Karnataka

Karnataka: కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ!

Karnataka: కర్ణాటకలో ప్రభుత్వ స్థలాల వినియోగంపై సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై న్యాయస్థానం తాజాగా మధ్యంతర స్టే విధించింది. ఈ పరిణామం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

ఉత్తర్వు లక్ష్యం RSS నేనా?
ప్రభుత్వం తీసుకున్న ఈ ఆదేశాలు ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాలను అడ్డుకునే ఉద్దేశంతో ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, కళాశాలల భూములపై ఆర్ఎస్ఎస్ శిబిరాలు లేదా కార్యకలాపాలు నిర్వహించకూడదని ప్రభుత్వం పరోక్షంగా ఈ ఉత్తర్వుల ద్వారా ఆదేశాలు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read: Pulluri Prasad Rao: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. కీలక నేతలు లొంగుబాటు!

కోర్టులో పిటిషన్, విచారణ: 
ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ పునస్చైతన్య సేవా సంస్థ అనే ప్రైవేట్ సంస్థ హైకోర్టు ధార్వాడ్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ చర్య, ప్రైవేట్ సంస్థలు తమ చట్టబద్ధమైన కార్యకలాపాలు నిర్వహించే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలు విన్న జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ప్రభుత్వ ఆదేశంపై తాత్కాలిక స్టే విధిస్తూ, తదుపరి విచారణ నిమిత్తం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ప్రభుత్వ వివరణ ఏంటి?
మంత్రి హెచ్.కె. పాటిల్ ఈ అంశంపై స్పందిస్తూ, ఈ నిర్ణయం ఏ ఒక్క ప్రత్యేక సంస్థను దృష్టిలో పెట్టుకుని తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ లేదా సంస్థాగత ఆస్తులను సరైన అనుమతితో, సరైన ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించుకోవాలన్నదే తమ ఉద్దేశమని ఆయన వివరించారు. ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే ప్రస్తుత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ప్రస్తుతానికి హైకోర్టు ఇచ్చిన స్టే కారణంగా ప్రభుత్వ ఆదేశాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ తీర్పు బీజేపీ నేతలకు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు ఊరటనిచ్చింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. రాజకీయ విశ్లేషకులు దీనిని కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా అభిప్రాయపడుతున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *