Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తడంపై పాకిస్థాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యవహారాన్ని ఒలింపిక్ క్రీడగా పోల్చుతూ, ఈ పొగడ్తల ఒలింపిక్ క్రీడలో షరీఫ్ స్వర్ణ పతకం గెలుచుకుంటారని హక్కానీ ఎక్స్ (X) లో పోస్ట్ చేశారు. అమెరికాలో పాకిస్థాన్ మాజీ రాయబారి అయిన హుస్సేన్ హక్కానీ, షెహబాజ్ షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ను పొగడటాన్ని ట్రంప్‌ను పొగిడే ఒలింపిక్ క్రీడగా పేర్కొంటూ, అందులో షరీఫ్ స్వర్ణ పతకానికి అగ్రస్థానంలో ఉన్నారని హక్కానీ చురక అంటించారు.
ఇది కూడా చదవండి: Credit Card Rewards: క్రెడిట్ కార్డుతో రివార్డు పాయింట్లు, ప్రయోజనాలు ఇవే..!
ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఒప్పందాలు, ముఖ్యంగా కౌలాలంపూర్ శాంతి ఒప్పందంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని, గాజా శాంతి ప్రణాళికలో ఆయన కృషి ప్రశంసనీయమని షెహబాజ్ షరీఫ్ ప్రశంసించారు. అంతకుముందు కూడా, దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ కృషి చేశారని, అందుకే పాకిస్థాన్ ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిందని షరీఫ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు స్వదేశంలో విమర్శలకు దారితీశాయి. షెహబాజ్ షరీఫ్ ఇటీవల అంతర్జాతీయ వేదికలపై డొనాల్డ్ ట్రంప్‌ను అతిగా కీర్తించడంపై, మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి

