CM Revanth Reddy: అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజే (అక్టోబర్ 28) దిగుతున్నారు. ఎలాగైనా ఈ స్థానాన్ని గట్టెక్కేలా తొలి నుంచి ప్రణాళికా బద్ధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నది. అధిష్ఠానాన్ని ఒప్పించి నవీన్ యాదవ్‌కు టికెట్ ఇప్పించి, గెలుపు వ్యూహాలను పరోక్షంగా వెనుక ఉండి రేవంత్‌రెడ్డి నడిపించారని ఆ పార్టీ వర్గాలే అంటుంటాయి.
CM Revanth Reddy: ఈ దశలో అసలు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారానికి వస్తారా? రారా? అన్న మీమాంస నెలకొన్నది. అయితే పార్టీ ప్రచారానికి ఆయన సిద్ధపడ్డారని, షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం (అక్టోబర్ 28) నాడు నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో తొలి ప్రచార సభను ఏర్పాటు చేశారు.
CM Revanth Reddy: ఈ ప్రాంతంలో అధికంగా ఉండే సినీ వర్గాలతో తొలి ప్రచారం కోసం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు తెలుగు ఫిలిం చాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పనిలో పనిగా తమ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ గెలుపు కోసం ఆయా వర్గాలను కోరనున్నట్టు సమాచారం.
CM Revanth Reddy: అదే విధంగా ఇదే నెల (అక్టోబర్) 30, 31 తేదీల్లో రోడ్ షో సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనున్నట్టు సమాచారం. నవంబర్ నెలలో 3, 4 తేదీల్లోనూ ఆయన రోడ్‌షోలు నిర్వహించనున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఆలోగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనపై రెఫరెండంగా ప్రజలు భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీతో పాటు రేవంత్‌రెడ్డి కీలకంగా భావిస్తున్నారు.

