Private Colleges Strike:

Private Colleges Strike: న‌వంబ‌ర్ 3 నుంచి ఆ కాలేజీలు బంద్‌.. ఎందుకంటే?

Private Colleges Strike: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల విషయం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. ద‌స‌రా పండుగ‌కు ముందు స‌ర్కారు ఇచ్చిన మాట త‌ప్పింద‌ని ప్రైవేటు క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు మండిప‌డుతున్నాయి. ఇక తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధ‌మ‌య్యాయి. ఈ నెలాఖ‌రు (అక్టోబ‌ర్‌)లోగా సర్కారు గ‌తంలో ఇస్తామ‌న్న రూ.900 కోట్ల‌ను కచ్చితంగా ఇవ్వాల‌ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ అసోసియేష‌న్ ఆఫ్ తెలంగాణ హ‌య‌యార్ ఇన్‌స్టిట్యూష‌న్స్ (ఫ‌తి) డిమాండ్ చేసింది. లేకుంటే న‌వంబ‌ర్ మొద‌టి వారంలో ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చ‌రిక‌లు జారీచేసింది.

Private Colleges Strike: ప్ర‌భుత్వం స్పందించ‌కుంటే న‌వంబ‌ర్ 3 నుంచి 10వ తేదీ వ‌ర‌కు ప్రొఫెష‌న‌ల్‌, డిగ్రీ, పీజీ క‌ళాశాల‌ల‌ను నిర‌వ‌ధికంగా మూసి వేస్తామ‌ని ఫ‌తి చైర్మ‌న్ ర‌మేశ్‌బాబు, ప్రధాన కార్య‌ద‌ర్శి కేఎస్ ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ఈ వారం రోజుల్లో ఉద్య‌మ త‌ర‌హాలో ఆందోళ‌న చేప‌డుతామ‌ని చెప్పారు. అధ్యాప‌కులు, విద్యార్థుల‌ను స‌మాయ‌త్తం చేసి తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న‌లు చేస్తామ‌ని వెల్ల‌డించారు.

Private Colleges Strike: న‌వంబ‌ర్ 10లోపే సుమారు 10 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌తో చ‌లో హైద‌రాబాద్ కార్య‌క్ర‌మం చేప‌ట్టి, హైద‌రాబాద్ న‌గ‌రాన్ని దిగ్బంధిస్తామ‌ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ అసోసియేష‌న్ ఆఫ్ తెలంగాణ హ‌య‌యార్ ఇన్‌స్టిట్యూష‌న్స్ (ఫ‌తి) నిర్ణ‌యించింది. మ‌రో రోజున 2 ల‌క్ష‌ల మంది అధ్యాప‌కుల‌తో కూడా చ‌లో హైద‌రాబాద్ చేప‌డుతామ‌ని వెల్ల‌డించింది.

Private Colleges Strike: మిగ‌తా 9,000 కోట్ల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిల‌ను 2026 మార్చిలోగా చెల్లించాల‌ని స‌ర్కార్‌ను డిమాండ్ చేసింది. ఆ చెల్లింపుల‌పై గ‌డువు తేదీని కూడా స్ప‌ష్టం చేయాల‌ని కోరారు. లేకుంటే మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో ఉద్య‌మాన్ని మ‌రింత ఉధ్రుతం చేస్తామ‌ని స్ప‌ష్టంచేసింది. 2025-2026 విద్యాసంవత్స‌రంలో స‌కాలంలో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చెల్లించాల‌ని కోరారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *