Russia-Ukraine War:ఓ ఏజెంట్‌ను నమ్మి ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు బలి పశువు అయ్యాడు. ఆ దేశం అతడిని సైనికుడిగా శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధరంగంలోకి పంపింది. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ వీడియో తీసి పంపడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆ యువకుడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు.
Russia-Ukraine War:హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ ఉపాధి కోసం ఓ ఏజెంట్ ద్వారా రష్యా దేశానికి వెళ్లాడు. అయితే అతడు వెళ్లీ వెళ్లగానే యుద్ధంలో సైనికుడిగా పంపేశారు. వెపన్స్ వాడకంలో బలవంతంగా శిక్షణ ఇచ్చారు. ఇతర సైనికులతో పాటు రష్యా బోర్డర్‌లో జరిగే యుద్ధంలో అతడిని ఇతర సైనికులతో పాటు ఉంచారు. తప్పనిసరి పరిస్థితిలో యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుందని తెలిపాడు.
Russia-Ukraine War:హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అహ్మద్‌తోపాటు 25 మందికి వెపన్ శిక్షణ ఇచ్చి ఒక గ్రూప్‌గా పంపారు. అయితే వారిలో 17 మంది చనిపోయారని మహ్మద్ అహ్మద్ సెల్ఫీ వీడియోలో దుఃఖభారంతో చెప్పాడు. ఆ చనిపోయిన వారిలో తనలాగే వచ్చిన ఒక భారతీయుడు కూడా ఉన్నాడని తెలిపాడు. ఎలాగైనా తన భర్తను రష్యా చెర నుంచి విడిపించి స్వదేశానికి రప్పించాలని కోరుతూ మహ్మద్ అహ్మద్ భార్య కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.

