Horoscope: మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల వారికి ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రోజు చాలా రాశుల వారికి శుభ సూచికలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు బాగా కలిసి రానుంది.
మేషం :
ఉద్యోగులకు వారి పనితీరుకు గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. అయితే, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి.
వృషభం :
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు, కొందరు మిత్రుల వల్ల నష్టం ఉండొచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
మిథునం :
ఉద్యోగంలో హోదా, కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. అధికారులు మీపై ప్రత్యేక బాధ్యతలు ఉంచుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశిస్తారు. ఆర్థిక బలం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు విజయవంతంగా పరిష్కారమవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు కూడా అందివస్తాయి.
కర్కాటకం :
ఉద్యోగంలో ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. క్రీడలు, బోధన రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
సింహం :
వృత్తి, ఉద్యోగాల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పనిభారం, ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. తలపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహకరం.
కన్య :
ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
తుల :
ఆర్థికంగా చాలా అనుకూల వాతావరణం. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. షేర్ మార్కెట్‌లో మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది.
వృశ్చికం :
వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
ధనుస్సు :
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉన్నత చదువులు, విదేశీ ప్రయాణాల విషయంలో విజయం సాధిస్తారు.
మకరం :
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించవచ్చు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
కుంభం :
ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
మీనం :
వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. విదేశీ ప్రయాణాలు, వీసా వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు.

