Rohit Sharma

Rohit Sharma: చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. ఒకే ఒక్కడు

Rohit Sharma: టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన మైలురాయిని చేరుకుని చరిత్ర సృష్టించాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులు చేయగానే ఒక అసాధారణ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర లిఖించాడు. ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్‌కు కూడా వారి సొంత గడ్డపై ఆస్ట్రేలియాపై వన్డే ఫార్మాట్‌లో 1000 పరుగులు సాధించడం సాధ్యం కాలేదు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు కూడా ఈ మైలురాయిని చేరుకోలేకపోయారు. ఈ అరుదైన ఘనతతో, ఆస్ట్రేలియా పిచ్‌లపై రోహిత్ శర్మకు ఉన్న అద్భుతమైన రికార్డు మరోసారి నిరూపితమైంది. తొలి వన్డేలో రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌లో 500వ మ్యాచ్ ఆడిన ఐదవ భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమైన రోహిత్, ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ సిరీస్‌లో మరింత రాణించి, 2027 ప్రపంచకప్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

టాప్ భారత ఆటగాళ్లు (ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో):

రోహిత్ శర్మ: 1000+ పరుగులు (రికార్డు సృష్టించాడు)

విరాట్ కోహ్లీ: 802 పరుగులు

సచిన్ టెండూల్కర్: 740 పరుగులు

ఎం.ఎస్. ధోని: 684 పరుగులు

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *