Telangana: కాంగ్రెస్ పార్టీకి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది. నిన్న రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆయన హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న (అక్టోబర్ 22) రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనకు మెరుగైన చికిత్స కోసం తమిళనాడు కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించినట్టు ప్రచారం జరిగింది.
Telangana: ఇదిలా ఉండగా, ప్రేమ్‌సాగర్ రావు ఆరోగ్యం విషమం వార్తలు అవాస్తవమని, ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని, నిన్నటిరోజే ఆయన కార్యకర్తలతోనూ మాట్లాడారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు కానీ, ఏఐజీ ఆసుపత్రి వర్గాలు కాని వెల్లడిస్తే కానీ, తెలిసే అవకాశం ఉన్నది. అక్టోబర్ 16న ఏఐజీ ఆసుపత్రికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా వెళ్లి ప్రేమ్‌సాగర్‌రావును పరామర్శించి వచ్చారు.