KP Vivek: ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) వైఖరిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన బీహార్ ఎన్నికల్లో పోటీదారుగా నిలబడి, ఇప్పుడు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekanand) విమర్శించారు.
“ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సైతాన్‌లా (Satan) కనిపిస్తే, ఎన్నికల తర్వాత ఆయన భగవాన్‌లా (God) కనపడుతున్నారా?” అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
కేపీ వివేకానంద మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్ఎస్ టిల్లు అని, ఆయనను ప్రజలు నమ్మకూడదని అసదుద్దీన్ ఓవైసీ పలు సార్లు ఆన్ రికార్డ్‌లో చెప్పిన విషయమే. గతంలో కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరూ పొగిడారు. ఇప్పుడు అదే ఓవైసీ సోదరులు జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందలేదని చెబుతూ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు,” అని వ్యాఖ్యానించారు.
వివేకానంద మాట్లాడుతూ, “ఓవైసీ బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీగా అభ్యర్థులను నిలబెట్టారు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. ఇది ప్రజలను గందరగోళానికి గురిచేయడమే,” అని మండిపడ్డారు.