Athidhi Re Release: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో నిమగ్నమై ఉన్నారు. మహేశ్ నటించిన చివరి చిత్రం ‘గుంటూరు కారం’. రాజమౌళి సినిమాపై అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అది పూర్తయి థియేటర్ల లో్కి రావటానికి కనీసం మరో రెండేళ్ళు పడుతుంది. ఈలోగా మహేశ్ ఫ్యాన్స్ కి ఊరట ఇచ్చేది మహేశ్ నటించిన పాత చిత్రాలు. వాటి రీరిలీజ్ లే. ఇక ఈ ఏడాది అలా రీరిలీజ్ అయి పెద్ద హిట్ ను కొట్టింది మహేశ్ ‘మురారి’ సినిమా. రీరిలీజ్ సినిమాలలో ట్రెండ్ సెట్ చేసింది మహేశ్ సినిమాలే అని మహేశ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు మహేశ్ నటించిన మరో సినిమాను రీరిలీజ్ చేయటానికి రెడీ అవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రమేశ్ బాబుతో కలసి రోనీ స్కూవాలా నిర్మించిన ‘అతిథి’ చిత్రం అప్పట్లో నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీని డిసెంబర్ 31కి రీరిలీజ్ చేస్తున్నారు. అమృతారావు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. మరి రీరిలీజ్ లో అయినా సినిమాను ఆదరిస్తారేమో చూడాలి.
