Garib Rath Express:పంజాబ్ రాష్ట్రంలో ప్రయాణిస్తున్న గరీబ్‌రథ్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. అమృత్సర్ నగరం నుంచి సహర్షా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అంబాలాకు అర కిలోమీటరు దూరంలో ఉన్న సర్హింద్ రైల్వేస్టేషన్ సమీపంలోనే రైలు ఉండగా ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
Garib Rath Express:రైలు కోచ్ నంబర్ 19లో ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ఓ ప్రయాణికురాలికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు. దీంతో వెంటనే అంతా కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని నిర్ధారించారు.