Kriti Sanon: హీరోయిన్ కృతి సనన్ చరిత్ర సృష్టించారు. బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో తొలి భారతీయ నటిగా ప్రసంగించారు. మహిళల ఆరోగ్యంపై ఆమె మాటలు ఆకట్టుకున్నాయి. ఈ స్ఫూర్తిదాయక ప్రసంగం గురించి తెలుసుకుందాం.
బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో కృతి సనన్ తొలి భారతీయ నటిగా ప్రసంగించి చరిత్ర సృష్టించారు. ‘మహిళల ఆరోగ్యం-ప్రపంచ సంపద’ అనే అంశంపై ఆమె శక్తివంతమైన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యాన్ని మానవాళి పురోగతికి మూలస్తంభంగా పరిగణించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలైనప్పటికీ, వారి వైద్యానికి తగిన నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన మహిళలు బలమైన సమాజాలను నిర్మిస్తారని, బాల్య వివాహం, ప్రసూతి సంరక్షణలో మార్పుల కోసం ప్రపంచ దేశాలు కృషి చేయాలని కోరారు. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ ఇండియా గౌరవ రాయబారిగా కృతి ఎంపికైన సంగతి తెలిసిందే. ఆమె తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ నవంబర్ 28న విడుదల కానుంది. కృతి ప్రసంగం అంతర్జాతీయ వేదికపై భారత దేశ గౌరవాన్ని పెంచింది.