Hyderabad:

Hyderabad: మీ నాన్న ఆటో పంపాడని స్కూల్ నుంచి బాలిక కిడ్నాప్‌న‌కు య‌త్నం

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో కిడ్నాప్ య‌త్నం క‌ల‌క‌లం రేపింది. మాయ‌మాట‌లు చెప్పి పాఠ‌శాల నుంచి మైన‌ర్ అయిన బాలిక‌ను ఆటోలో కిడ్నాప్ చేసేందుకు ఓ వ్య‌క్తి య‌త్నించగా, ఆ బాలిక చాక‌చ‌క్యంగా తప్పించుకోవ‌డంతో ముప్పు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డున చార్ క‌మాన్ ప్రాంతంలో చోటుచేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.

Hyderabad: హైదరాబాద్ చార్ క‌మాన్ ప్రాంతం ప‌రిధిలో ఉన్న ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో సుల్తాన్ షాహీ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి చ‌దువుకుంటున్న‌ది. సాయంత్రం స్కూల్ అయిపోగానే ఆ బాలిక స్కూల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. వ‌చ్చీరాగానే గుర్తుప‌ట్టినట్టుగా, ఆ బాలిక వ‌ద్ద‌కు ఓ వ్య‌క్తి వ‌చ్చాడు. మీ నాన్న నిన్ను తీసుకురావాల‌ని ఆటో పంపించాడు… అని చెప్పి న‌మ్మ‌బ‌లికాడు.

Hyderabad: నిజ‌మేన‌ని న‌మ్మిన ఆ బాలిక ఆ ఆటోలో ఎక్కి కూర్చున్న‌ది. ఆ బాలిక ఎక్కిన ఆటో త‌న ఇల్లు ఉన్న‌ సుల్తాన్ షాహీ ప్రాంతం వైపు కాకుండా, మ‌ల‌క్‌పేట వైపు వెళ్తుండ‌గా, ఆ బాలిక‌కు అనుమానం క‌లిగింది. ఈలోగా ఆ బాలిక‌తో ఆ వ్య‌క్తి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయింది. ఈ లోగా ఓ సిగ్న‌ల్ రాగానే చాక‌చ‌క్యంగా ఆ బాలిక ఆటో నుంచి దూకి, కేక‌లు వేసింది.

Hyderabad: ఆ బాలిక కేక‌లు విన్న స్థానికులు, వాహ‌న‌దారులు ఆ ఆటోలో ఉన్న వ్య‌క్తిని ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించారు. దీంతో ఆ బాలిక ఆ దుర్మార్గుడి చెర నుంచి వీడిపోయింది. కానీ, ఇలా ఎంద‌రో బాలిక‌లు మోస‌పోతున్న‌ట్టు పోలీసుల రికార్డులే చెప్తున్నాయి. వారి వ‌ద్ద‌కు వ‌చ్చే మిస్సింగ్ కేసులో సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్ప‌టికైనా పోలీసుల‌తోపాటు త‌ల్లిదండ్రులు కూడా త‌మ పిల్ల‌ల పట్ల జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉన్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *