Maganti SunithaGopinath: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ బుధవారం (అక్టోబర్ 15న) నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే మంగళవారమే ఆ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఆమె బీఆర్ఎస్ పార్టీ బీఫాం అందుకున్నారు. ఈ రోజు తొలుత ఆమె బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ నుంచి ఆ పార్టీ ముఖ్యనేతలతో కలిసి బయలుదేరి షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాన్ని సమర్పిస్తారు.
Maganti SunithaGopinath: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ నామినేషన్ కార్యక్రమానికి ఆ పార్టీ కీలక నేతలు ఆమె వెంట వెళ్లనున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా కేటీఆర్ సహా వారంతా మీడియాతో మాట్లాడనున్నట్టు సమాచారం.