Kanchipuram::కంచిని దగ్గు మందు మృతులు..

Kanchipuram: తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా సంస్థ తయారు చేసిన ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు సిరప్‌ కారణంగా మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఈ సంఘటనపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం, కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ విభాగం ఆ సంస్థకు ఇచ్చిన తయారీ అనుమతులను రద్దు చేస్తూ, సంస్థను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర ఔషధ తయారీ యూనిట్లలో తనిఖీలు జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

48.6% విషపూరిత పదార్థం

దర్యాప్తులో భాగంగా అధికారులు సేకరించిన సిరప్ నమూనాలు పరీక్షించగా, అందులో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ (Diethylene Glycol) అనే అత్యంత విషపూరిత రసాయనం ఉందని బయటపడింది. ఇది మనిషి శరీరంలోకి చేరితే కిడ్నీ వైఫల్యం, కాలేయం దెబ్బతినడం, చివరికి మరణం వంటి ప్రమాదాలను కలిగిస్తుంది.

భారీ ఉల్లంఘనలు, యజమాని అరెస్ట్

తనిఖీల్లో 300కి పైగా ఉల్లంఘనలు రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు. సరైన తయారీ ప్రమాణాలు పాటించకపోవడమే కాకుండా, భద్రతా నియమాలను కూడా విస్మరించినట్లు తేలింది.

ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే శ్రేసన్ ఫార్మా యజమానిని అరెస్టు చేసింది. ఈరోజు ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా కంపెనీకి చెందిన పలు ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టింది.

రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యమే కారణం

కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) దర్యాప్తు ప్రకారం, తమిళనాడు రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం నిర్లక్ష్యం ఈ దుర్ఘటనకు కారణమని తేలింది. కేంద్రం చేసిన పలు సిఫార్సులను రాష్ట్ర అధికారులు అమలు చేయకపోవడం, పర్యవేక్షణలో లోపాలు చోటుచేసుకోవడం వల్లే విషపూరిత సిరప్ మార్కెట్లోకి రావడం, చివరికి చిన్నారుల మరణాలకు దారి తీసిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *