Ind vs Wi 2nd Test: ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో గట్టి పోరాటం చేసింది. ఫాలో-ఆన్ ఆడుతున్న విండీస్, అంతా ఊహించినట్టు తొందరగా ఆలౌట్ కాకుండా, ఏకంగా 390 పరుగులకు ఆలౌట్ అయ్యి భారత్ ముందు 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంతో, వెస్టిండీస్ ఫాలో-ఆన్ ఆడాల్సి వచ్చింది. కానీ, కరీబియన్ బ్యాటర్లు పట్టుదలగా ఆడి భారత బౌలర్లకు శ్రమ కలిగించారు.
సెంచరీలతో హోరాహోరీ:
వెస్టిండీస్ తరఫున ఓపెనర్ క్యాంప్‌బెల్ (115), అలాగే షాయ్ హోప్ (103) అద్భుతమైన సెంచరీలు సాధించారు. దీంతో ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. వీరికి తోడు జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32) కూడా కీలక పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ముఖ్యంగా, పదో వికెట్‌కు గ్రీవ్స్, సీల్స్ కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.
నాలుగో రోజు ఆట సాగిందిలా:
ఓవర్‌నైట్ స్కోరు 173/2 తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన విండీస్, ప్రారంభంలో బాగా ఆడింది. ఓపెనర్ క్యాంప్‌బెల్ తన సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే కుల్దీప్ బౌలింగ్‌లో ఔట్ అవ్వడంతో భారత్‌కు ఊరట లభించింది. లంచ్ బ్రేక్ సమయానికి విండీస్ స్కోరు 252/3. అయితే, రెండో సెషన్లో టీమిండియా బౌలర్లు విజృంభించడంతో విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. సెంచరీ పూర్తి చేసిన షాయ్ హోప్‌ను సిరాజ్ పెవిలియన్ పంపడంతో భారత శిబిరంలో ఆనందం నెలకొంది. ఆ తర్వాత కుల్దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి విండీస్ నడ్డి విరిచాడు. చివర్లో బుమ్ర బౌలింగ్‌లో సీల్స్ ఔట్ అవ్వడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
భారత బౌలర్ల ప్రదర్శన:
భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3 వికెట్లు), పేసర్ జస్ప్రీత్ బుమ్రా (3 వికెట్లు) చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటారు. సిరాజ్ 2 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మరియు వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో తొలి దెబ్బ:
ప్రస్తుతం భారత్ తమ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. అయితే, స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి వారికన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవడానికి భారత్ మిగిలిన లక్ష్యాన్ని ఎంత వేగంగా ఛేదిస్తుందో చూడాలి.