Nadendla Manohar: ఆంధ్ర రాష్ట్రంలో బియ్యం సరఫరా, పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు అన్ని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
“ఎక్కడా అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది నుంచే ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేలా చర్యలు చేపట్టాం” నాదెండ్ల మనోహర్ తెలిపారు.
స్మార్ట్ రైస్ కార్డులు, క్యూఆర్ కోడ్ వ్యవస్థ
ప్రజలకు పారదర్శక సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం స్మార్ట్ రైస్ కార్డులు జారీ చేసింది. ప్రతి కార్డుపై ఉన్న QR కోడ్ ద్వారా బియ్యం పంపిణీని డిజిటల్‌గా ట్రాక్ చేయగల విధానం అమలు చేస్తున్నారు.
దీంతో ప్రతి దుకాణానికి ఎంత బియ్యం తరలించబడిందో, ఎంత మంది ప్రజలకు పంపిణీ అయ్యిందో అనే వివరాలు రియల్ టైమ్‌లో సేకరించబడుతున్నాయి.
సంస్కరణలతో మార్పు
ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలతో బియ్యం పంపిణీ వ్యవస్థలో మార్పు ప్రారంభమైందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. “సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు మార్పు మొదలవుతుంది. అందుకే ప్రతి దశలో సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టాం” అని నాదెండ్ల మనోహర్ వివరించారు.
ఇది కూడా చదవండి: AP Weather: ఏపీలో మరో మూడు రోజులు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు
ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు
ప్రజల్లో కూడా అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ నష్టం, పేదల హక్కులపై ప్రభావం వంటి అంశాలపై గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సిట్ పర్యవేక్షణలో సీఎం ప్రత్యక్షంగా
ఈ మొత్తం ప్రక్రియను ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న S.I.T. (Special Investigation Team) పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే పలు సమీక్షా సమావేశాలు నిర్వహించబడి, అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వబడినట్లు సమాచారం.