Thalapathy Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలను, బాధితులను నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ పరామర్శించేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆయా బాధిత కుటుంబాలను విడివిడిగా వారిళ్లకే వెళ్లి స్వయంగా కలుస్తానని తమిళనాడు డీజీపీకి పెట్టుకన్న వినతిని తిరస్కరించారు. కరూర్‌లోని ఓ చోట వేదిక ఏర్పాటు చేసి పరిమిత సంఖ్యలో వచ్చిన వారిని పరామర్శించేందుకు అనుమతిని ఇచ్చారు.
Thalapathy Vijay: తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత, సినీనటుడు విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది దుర్మరణం పాలయ్యారు. అదే ఘటనలో సుమారు 60 మంది వరకు గాయాలపాలయ్యారు. ఈ విషాద ఘటనతో రాజకీయ వర్గాల్లోనూ పెను ప్రకంపనలు జరిగాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని స్టాలిన్ ప్రభుత్వం స్పందించి, ఆర్థికసాయం కూడా ప్రకటించాయి.
Thalapathy Vijay: ఈ నేపథ్యంలో తాను కరూర్ మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించి సాయం చేస్తానని విజయ్ ప్రకటించారు. ఈ మేరకు తాను వ్యక్తిగతంగా ఒక్కొక్కరినీ కలుస్తానన్న వినతిని రాష్ట్ర పోలీస్ శాఖ నిరాకరించింది. దీంతో కరూర్‌లోని ఏర్పాట్లకు అనుమతిని ఇచ్చింది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు ఇచ్చేందుకు టీవీకే ముందుకొచ్చింది.
Thalapathy Vijay: ఈ నెల (అక్టోబర్ 17)న కరూర్‌లో ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి భారీ భద్రత నడుమ మృతుల కుటుంబాలు, బాధతులను విజయ్ పరామర్శిస్తారని అధికారులు వెల్లడించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వేదిక వద్దకు బాధిత కుటుంబాలను మాత్రమే అనుమతించనున్నట్టు ఆ అధికార వర్గాలు పేర్కొన్నాయి.