jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రణరంగంలోకి దిగక ముందే బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి ఎంపిక జరగక ముందే ఆ పార్టీ నేత ఒకరు బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు తన రాజీనామా లేఖను పంపినట్టు చెర్క మహేశ్ తెలిపారు.
jubliee hills By elections 2025: బీజేపీ గుట్టుచప్పుడు కాకుండా సీఎం రేవంత్‌రెడ్డితో చేతులు కలిపి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నదని చెర్క మహేశ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రజలను మోసం చేశాయని ధ్వజమెత్తారు. రైతులు, యువత, మహిళలు, బీసీలు బాధలో ఉన్నా బీజేపీ మౌనంగా ఉన్నదని తెలిపారు. అలాంటి పార్టీలో ఉండబోనని, అందుకే రాజీనామా చేశానని రాంచందర్‌రావుకు పంపిన లేఖలో చెర్క మహేశ్ పేర్కొన్నారు.