Arunachal Earthquake: శనివారం ఉదయం అరుణాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు కమంగ్ (East Kameng) జిల్లాలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం ఉదయం 8:31 గంటలకు సంభవించిందని, భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Tennessee Explosion: అమెరికాలోని టెన్నెస్సీలో భారీ పేలుడు.. 19 మంది మృతి
భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానిక ప్రజలు కొద్దిసేపు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు సమాచారం. ఈశాన్య ప్రాంతం సిస్మిక్ యాక్టివ్ జోన్లో ఉండటం వలన తరచుగా అక్కడ స్వల్ప ప్రకంపనలు నమోదవుతుంటాయి.