SSMB29: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 సినిమా. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రెస్టీజియస్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. మహేష్ బాబు కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
మహేష్ బాబు కొత్త లుక్ హాట్ టాపిక్
ఈ చిత్రంలో మహేష్ బాబు ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, జిమ్‌లో శరీరాన్ని తీర్చిదిద్దుకున్న ఫిట్ లుక్. ఇవన్నీ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ వర్గాలు కూడా “మహేష్ బాబు ఈసారి డిఫరెంట్ అవతార్‌లో కనిపించబోతున్నాడు” అని అంచనా వేస్తున్నాయి.
పాన్-ఇండియా లెవెల్‌లో స్టార్ కాస్ట్
ఈ మూవీకి సంబంధించిన కాస్ట్ కూడా అంతర్జాతీయ స్థాయిలోనే ఉంది. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ డివా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ కాంబినేషన్ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. రాజమౌళి మార్క్ యాక్షన్, విజువల్ ట్రీట్, మహేష్ కొత్త ఇమేజ్ ఈ మిక్స్‌తో సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: Group-1: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట
టైటిల్‌పై ఉత్కంఠ – “వారణాసి”నా?
ప్రస్తుతం సినిమా టైటిల్‌పై ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. టాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాకి “వారణాసి” అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. అయితే రాజమౌళి & టీం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొందరంటూ ఇది ఫేక్ న్యూస్ అని చెబుతుంటే, మరికొందరంటూ ఈ టైటిల్ సినిమాలోని కాన్సెప్ట్‌కి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు.
నవంబర్ 16న భారీ ప్లాన్
రీసెంట్‌గా మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్‌లో నవంబర్ 16న టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని ప్రకటించారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, రాజమౌళి ఈ ఈవెంట్‌ను హాలీవుడ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. రామోజీ ఫిలింసిటీలో జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్‌లో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించే ఆలోచనలో ఉన్నారట.
రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో స్పెషల్‌గా రూపొందించిన భారీ సెట్లో జరుగుతోంది. అది వారణాసి వాతావరణాన్ని తలపించేలా రూపొందించారట. ఇప్పటికే మహేష్, ప్రియాంక లతో కీలక సీన్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఇప్పుడు టీం పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులపై దృష్టి సారిస్తోంది.
ఎక్స్‌పెక్టేషన్స్ ఆల్ టైమ్ హై
రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌పై మొదటి నుంచీ భారీ అంచనాలున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.