Trump Tariffs

Trump Tariffs: భారత్‌పై సుంకాలను రద్దు చేయాలి!

Trump Tariffs: భారత్ తో అమెరికా సంబంధాలు క్షీణించిన వేళ…ఆ దేశానికి చెందిన చట్టసభ సభ్యులు తమ బలమైన సందేశాన్ని.. అధ్యక్షుడు ట్రంప్ నకు వినిపించారు. భారత్ తో సంబంధాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు 19మంది చట్టసభ సభ్యులు…. అధ్యక్షుడు ట్రంప్ నకు లేఖ రాశారు. వారిలో ప్రముఖ డెమెక్రాట్ నేత… దెబోరా రాస్ , రోఖన్నా కూడా ఉన్నారు. భారత ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు అమెరికా వినియోగదారులు, భారత ఉత్పత్తిదారులకు….. తీవ్ర నష్టం కలిగించాయని వారు లేఖలో పేర్కొన్నారు. భారత్ తో బలమైన కుటుంబ సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు కలిగిన ఇండియన్ -అమెరికన్ కమ్యూనిటీలు నివసిస్తున్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు వారు గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Cancer: ఒకేఒక రక్త పరీక్షతో 10 ఏళ్లకు ముందే ఒంట్లో క్యాన్సర్‌ గుర్తింపు

ప్రపంచంలో…. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం…ఇరుదేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఈ నిర్ణయం ఇరుదేశాలకు ప్రతికూల పరిణామాలను సృష్టించిందని తెలిపారు. కీలకమైన భాగస్వామ్యాన్ని మరమ్మతు చేయడానికి పునరుద్ధరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. టారిఫ్ విధానంపై సమీక్షించి., భారత ప్రభుత్వంతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎట్టకేలకు ముగింపు దశకు చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితో…ఇజ్రాయెల్-హమాస్…తొలిదశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు…ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, హమాస్ కూడా ధ్రువీకరించాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *