Local Body Elections 2025: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు నేడు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తొలి విడత జిల్లా పరిషత్ (ZPTC), మండల పరిషత్ (MPTC) ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఎలాంటి ఆటంకం కల్పించకపోవడంతో ఎన్నికల కమిషన్కు మార్గం సుగమమైంది.
రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
-
మొదటి విడత:
-
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9 నుంచి 11 వరకు
-
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 12
-
ఉపసంహరణ గడువు: అక్టోబర్ 15
-
పోలింగ్: అక్టోబర్ 23
-
-
రెండో విడత:
-
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13 నుంచి 15 వరకు
-
పరిశీలన: అక్టోబర్ 16
-
ఉపసంహరణ: అక్టోబర్ 19 వరకు
-
పోలింగ్: అక్టోబర్ 27
-
రెండు విడతలకూ ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరుగుతుంది. మొత్తం 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: AP High Court: మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మిస్తే తప్పేముంది?
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు.
-
మొదటి విడత:
-
నామినేషన్లు: అక్టోబర్ 17–19
-
పరిశీలన: అక్టోబర్ 20
-
ఉపసంహరణ: అక్టోబర్ 23 వరకు
-
పోలింగ్: అక్టోబర్ 31 (ఫలితాలు అదే రోజు మధ్యాహ్నం)
-
-
రెండో విడత:
-
నామినేషన్లు: అక్టోబర్ 21–23
-
పరిశీలన: అక్టోబర్ 24
-
ఉపసంహరణ: అక్టోబర్ 27 వరకు
-
పోలింగ్: నవంబర్ 4 (ఫలితాలు అదే రోజు)
-
-
మూడో విడత:
-
నామినేషన్లు: అక్టోబర్ 25–27
-
పరిశీలన: అక్టోబర్ 28
-
ఉపసంహరణ: అక్టోబర్ 31 వరకు
-
పోలింగ్: నవంబర్ 8 (ఫలితాలు మధ్యాహ్నం తర్వాత)
-
ఈ ఎన్నికల్లో మొత్తం 12,733 సర్పంచ్ స్థానాలు, 1,12,288 వార్డు సభ్యుల స్థానాలు భర్తీ కానున్నాయి.
ఏర్పాట్లపై సమీక్ష
రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం రాత్రి 31 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎన్నికల నిర్వహణ, సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, బ్యాలెట్ పేపర్లు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కోడ్ను కఠినంగా అమలు చేయాలని, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజాస్వామ్య వేడుకకు రంగం సిద్ధం
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. జిల్లాల స్థాయిలో పార్టీ బలం, నేతల ప్రభావం ఈ ఎన్నికల్లో తేలనుంది. గ్రామాల నుంచి మండలాల వరకు రాజకీయ ఉత్సాహం నెలకొంది. ప్రజాప్రతినిధుల ఎన్నికలతో పాటు గ్రామీణ అభివృద్ధి దిశగా కొత్త నేతలు, కొత్త నాయకత్వం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.